హైదరాబాద్‌లో కారు బీభ‌త్సం.. ఆర్మీ జ‌వాన్ మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌ (Hyderabad)లో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. రాంగ్ రూట్‌లో దూసుకొచ్చి ఓ ఆర్మీ జ‌వాన్ (Army Jawan) మృతికి కార‌ణ‌మైంది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదర్‌షాకోట్‌లో ఓ వ్య‌క్తి సోమ‌వారం ఉద‌యం అతి వేగంగా కార్ డ్రైవ్ చేశాడు. రాంగ్ రూట్‌లో వ‌స్తూ రోడ్డు ప‌క్క‌న న‌డుచుకుంటూ వెళ్తున్న జ‌వాన్‌ను ఢీకొట్టాడు. ఆ త‌ర్వాత రెండు బైక్‌ల‌ను కూడా ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆర్మీ జ‌వాన్‌ తీవ్ర గాయాల‌పాలై అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోప్ఓయాడు.

బైక్‌ల‌పై వెళ్తున్న‌ మరో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత కారులో ఉన్న‌వాళ్లు వెంట‌నే అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. నార్సింగి పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్నారు. కారు డ్రైవింగ్ చేసిన వ్య‌క్తి, అందులో ఉన్న వారు మ‌ద్యం సేవించి ఉన్నారా? అతి వేగ‌మే ప్ర‌మాదానికి ముఖ్య కార‌ణమా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>