Mobile Popup Ad
Mobile Popup Ad

అర్జెంటీనా-అల్జీరియా అభిమానుల ఘర్షణ.. రంగంలోకి పోలీసులు

కలం, స్పోర్ట్స్: ఫిఫా 2026 వరల్డ్ కప్‌లో అర్జెంటీనా-అల్జీరియా (Argentina vs Algeria) మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో అర్జెంటీనా, అల్జీరియా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు మార్చుకుంటూ కనిపించారు. ఈ ఘర్షణకు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.

అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో న్యూయార్క్ పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను విడదీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు నమోదుకాలేదని సమాచారం. ఇదిలా ఉండగా, గ్రూప్-జేలో భాగంగా అర్జెంటీనా, అల్జీరియా (Argentina vs Algeria) జట్లు కాన్సాస్ సిటీలో తలపడనున్నాయి. 2022 ప్రపంచకప్ విజేత అర్జెంటీనా తన టైటిల్ రక్షణ పోరును ఈ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ కండరాల అలసట నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నట్లు ధృవీకరించబడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>