చల్లని కబురు.. ఏపీలో మరిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించిన రుతుపవనాలు

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో విభిన్న వాతావరణ (AP Weather) పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ( జూన్ 11) నాడు నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అంతేకాదు రాబోయే 2, 3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని పేర్కొంది.

ఈ మేరకు రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణం చల్లబడే అవకాశాలున్నాయన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయని వెల్లడించారు. 2,3 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

Read Also: పీవోకేలో పాక్ సైన్యం అరాచకం.. 16 మంది మృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>