కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ (AP Speaker) చింతకాయల అయ్యన్నపాత్రుడు వివాదంలో చిక్కుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో (Narsipatnam) నిర్వహించిన ఒక జాతరలో ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
స్థానికంగా జరిగిన జాతరలో ఎత్తుల భాస్కరరావు అనే దళిత వ్యక్తి డప్పు కొడుతుండగా, ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అతడి చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్పీకర్ వంటి ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, బహిరంగంగా ఒక సామాన్యుడిపై, అందునా దళితుడిపై ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు స్పీకర్ (AP Speaker) తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-డప్పు కొడుతున్న వ్యక్తిపై చేయి చేసుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
-ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్
AP Speaker Ayyanna Patrudu who slapped a man who was beating a drum#AyyannaPatrudu #APSpeaker #AndhraPradesh #AyyannaPatruduControversy #SpeakerControversy #Kalam… pic.twitter.com/Z2B59FqUfN— Kalam Daily (@kalamtelugu) April 3, 2026
Read Also: జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై మాజీ మంత్రి ఆగ్రహం
Follow Us On : WhatsApp

