కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరణ, అనంతరం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రెస్ మీట్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. “తెలంగాణ మీ అయ్య జాగీరా” అన్న పవన్ వ్యాఖ్యలకు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, యువకులు, ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అయ్యాయి. స్థానిక నాయకులు, పౌరులు పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే అంటూ ఘాటుగా స్పందించారు. వీరిలో ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ఎమ్మెల్యే మందుల సామేల్‌ల వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ కాంగ్రెస్ నాయకులిద్దరూ పవన్‌ను ఏకి పారేశారు. పవన్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాడని, ఆయన వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ పోలీసులు (AP Police) స్పందించారు. ఈ వీడియోలను పోస్టు చేసిన ఎక్స్ హ్యాండిల్స్‌కు అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. తక్షణమే ఈ వీడియోలను తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. గతంలో సైతం పవన్ కల్యాణ్‌పై జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జాడ్సన్ మాట్లాడిన వీడియోలను పోస్టు చేసిన వారికి కూడా నోటీసులు అందాయి.
Read Also: ప్రధాని మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్..!
Follow Us On: X(Twitter)

