కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తానన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Dola) విమర్శలు గుప్పించారు. విజయసాయి రాజకీయ జీవితం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నుంచే బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఎలా ఎదుగుతారని ప్రశ్నించారు. విజయ సాయి రెడ్డి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.
విజయసాయి రెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గతంలో ఎదుర్కొన్న కేసులు, జైలు శిక్షలను కూడా ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

