Mobile Popup Ad
Mobile Popup Ad

బాలల భద్రత, రక్షణ, సంక్షేమంలో జిల్లా అగ్రభాగాన నిలవాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో: బాలల భద్రత, రక్షణ, సంక్షేమంలో కరీంనగర్ జిల్లాను అగ్ర భాగాన ఉంచేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) ఆదేశించారు. ఈనెల 27వ తేదీ నుంచి మే 2 వరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత రక్షణ సంక్షేమం (Child Safety and Welfare Initiatives)పై వారం రోజులపాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అన్ని పథకాలు కార్యక్రమాలపై గ్రామగ్రామానా విస్తృతంగా ప్రజలకు అవగాహన పెంపొందించాలని సూచించారు. శనివారం రాత్రి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బాలల భద్రత రక్షణ సంక్షేమ వారం కార్యక్రమాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సఖి స్వధార్ చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 27 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బాలల భద్రత రక్షణ సంక్షేమ వారం కార్యక్రమాలను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు.

మహిళ శిశు సంక్షేమంలో సిడిపిఓల పాత్ర కీలకమని అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ మాతా శిశు సంరక్షణ విషయంలో అత్యుత్తమ సేవలందించాలని సూచించారు. పట్టణాలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. తద్వారా వారంతా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతానికి తగిన సహాయ సహకారాలు అందిస్తారనీ ప్రభుత్వ లక్ష్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో కార్యక్రమం విజయవంతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. సైబర్ మోసాలు డ్రగ్ నియంత్రణ చిన్నారులపై వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లను అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, డీపీవో జగదీశ్వర్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ యాదవ్, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, సిడిపివోలు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>