ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) షెడ్యూల్‌పై కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల 13న అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కాబోతుంది. 14 లేదా 15వ తేదీన షెడ్యూల్ విడుదల చేయబోతుంది. నవంబరు 30వ తేదీలోపు మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులకు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

సుప్రీం కోర్టు నిర్దేశించిన మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు సుమారుగా 4 వేలకు పైగా స్థానాలు పెరగబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు మినహా వివిధ కేటగిరీలకు చెందిన 1.40 లక్షలకు పైగా స్థానాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తించనుండటంతో స్థానిక సంస్థల్లో 38 వేలకు పైగా బీసీలకు పదవులు దక్కబోతున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>