ఏపీలో ముగిసిన ఎన్నికల ప్రచారం

కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) ప్రచారం గడువు ముగిసింది. నవంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగబోతుండగా.. 48 గంటల ముందే ప్రచార మైక్‌లు మూగబోయాయి. నవంబర్ మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 38 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తోంది. ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా చివరి సారిగా వివిధ జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అర్నబ్ తుఫాన్ కారణంగా ప్రభావితమైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ అమలు చేయాలని.. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>