ఏపీ స్థానిక సంస్థ‌ల‌కు ముగిసిన నామినేష‌న్లు

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో రెండో ద‌శ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు (AP Local Body Election) నామినేష‌న్ ప్ర‌క్రియ నేడు సాయంత్రంతో ముగిసింది. మొత్తం 23 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఇందులో 4 కార్పొరేష‌న్లు, 19 మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీలు ఉన్నాయి. మంగ‌ళ‌వారం ఆయా నామినేషన్ల పరిశీలన జ‌రుగ‌నుంది. ఈ నెల‌ 19 వరకు ఉపసంహరణకు గడువు అవ‌కాశం క‌ల్పించారు. అదే రోజు అభ్య‌ర్థుల తుది జాబితా ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ నెల 29న పోలింగ్ చేప‌ట్టి 30న ఓట్ల లెక్కిస్తారు.

మ‌రోవైపు నేడు పంచాయ‌తీ ఎన్నిక‌ల రెండో ద‌శ నామినేష‌న్ల‌కు ఈసీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొద‌టి విడ‌త‌లో 176 పంచాయితీల‌కు నామినేష‌న్లు స్వీక‌రించారు. రేప‌టితో తొలి విడ‌త ఎన్నిక‌ల నామినేష‌న్లు ముగియ‌నున్నాయి. మొద‌టి విడ‌త ఎన్నిక‌ల్లో 3.71 ల‌క్ష‌ల ఓట‌ర్లు పాల్గొన‌నున్నారు. మ‌రోవైపు పంచాయ‌తీ ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో సైతం తీవ్ర ఘ‌ర్ష‌ణలు చోటు చేసుకుంటున్నాయి. క‌డ‌ప జిల్లా రాయ‌చోటిలో ఎన్నిక‌ల నామినేష‌న్ తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. స్థానికంగా 84 పంచాయ‌తీల్లో 23కు మాత్ర‌మే నామినేష‌న్లు వ‌చ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>