Mobile Popup Ad
Mobile Popup Ad

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్ట్‌ విచారణ

కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం కలిగించిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ కేసులో మరికాసేపట్లో హైకోర్ట్ విచారణ చేపట్టబోతుంది. సాయికృష్ణ ఎక్కడున్నాడో తమ ముందు హాజరుపర్చాలని గత విచారణ సందర్భంగా హైకోర్ట్ ఆదేశించింది. సీఐ నాగరాజు సమక్షంలోనే లాకప్ డెత్ జరిగిందని సిట్ నిర్ధారించిన నేపథ్యంలో, హైకోర్ట్ ఎలాంటి ఆదేశాలిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సాయికృష్ణ తల్లి తాజాగా మరో పిటిషన్ యాడ్ చేశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పేర్కొన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిందని హైకోర్టుకు ప్రభుత్వం వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కానిస్టేబుళ్ల కోసం గాలింపు..

లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజు ఇప్పటికే రిమాండ్ లో ఉండగా.. మరో ముగ్గురు హస్తం ఉందని సిట్ గుర్తించింది. ఈ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి పరారీలో ఉన్న వారి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. వీరిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో వ్యక్తి సురేశ్ సీఐ నాగరాజు స్నేహితుడిగా తేలింది. సురేశ్ పాత్రపైనే అనేక అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో, అతడిని విచారిస్తే గానీ సాయికృష్ణ డెడ్ బాడీ ఏమైపోయిందనేది తెలియరాదని సిట్ భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>