రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశంగా గుర్తింపు పొందిన రైసినా డైలాగ్ 2026 (Raisina Dialogue 2026) కార్యక్రమం ఈసారి ఢిల్లీలోని ప్రగతి మైదాన్, భారత్ మండపంలో నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాయకులు, విధాన నిర్ణేతలు, నిపుణులు పాల్గొనే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొని వివిధ అంశాలపై చర్చించనున్నారు.

సీఎం చంద్రబాబు (Chandrababu) రేపు ఉదయం 11 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ (Delhi) కి చేరుకోనున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అదే రోజు సాయంత్రం తిరిగి రాత్రి 7 గంటలకు ఉండవల్లికి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. రైసినా డైలాగ్‌ (Raisina Dialogue)లో ఆయన రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత వంటి అంశాలపై దేశీయ-అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Read Also: టీటీడీ భగవద్గీత పుస్తకాల ప్రచురణ వివాదం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>