కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను (Union Budget) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ ఎంతో సమతుల్యంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒక దీర్ఘకాలిక దార్శనికతతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దారని తెలిపారు. ఇది ప్రజల జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకురావడమే కాకుండా, స్థిరమైన వృద్ధికి బాటలు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. అద్భుతమైన బడ్జెట్‌ను అందించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ కార్యకర్తలు
Follow Us On: X(Twitter)


