Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ కేబినెట్ కీలక భేటీ.. 20కి పైగా అంశాలపై చర్చ!

కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ (AP Cabinet) భేటీ అయ్యింది. దాదాపు 20కి పైగా అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. వీటిలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టులు ఏర్పాటు, 1,730 ఉద్యోగాల సృష్టికి ఆమోదం తెలపడంపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని వడ్డెర సంఘాలకు ప్రాధాన్య క్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులు, లీజుల కేటాయింపుల్లో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ అంశాలపై మంత్రులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేయడంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>