కలం, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ (AP Assembly) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభమైన కొద్ది సేపటికే వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం కొద్ది సేపటికే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
నేటి నుంచి అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియతో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అసెంబ్లీలో సభ్యుల అటెండెన్స్ నిర్వహిస్తారు. అసెంబ్లీకి వచ్చి లోపల కూర్చుంటేనే అటెండెన్స్ నమోదవుతుంది. అసెంబ్లీ స్పీకర్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై రిజిస్టర్‌లో హాజరు పద్దతి ఉండదని అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్యేలకు తెలిపారు.


