ఆదరణ 3.0తో బీసీలకు శాశ్వత ఉపాధి: మంత్రి సవిత

కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత (Minister Savitha) నేతృత్వంలో ‘ఆదరణ 3.0’ పథకంపై మంగళవారం కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రితో పాటు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ పథకం ద్వారా బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

ఈ పథకం ద్వారా కులవృత్తులకు సాంకేతిక పరికరాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వృత్తి నైపుణ్యం పెంచుకునేలా లబ్ధిదారులకు ప్రత్యేక శిక్షణ ఉంటుందన్న మంత్రి.. లబ్ధిదారులకు రూ.10 వేల నుంచి 50 వేలు ఆదాయం వచ్చేలా యూనిట్లు నెలకొల్పుతామని చెప్పుకొచ్చారు. ఆదరణ ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>