కలం, సినిమా: పాన్ ఇండియా సినిమాల కాన్సెప్ట్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఒక పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఛాయా సాహిత్యోత్సవం’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సినిమా అనేది ఒక కళారూపంగా కాకుండా లాభాలు ఆర్జించే వ్యాపారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్మాతలు, వ్యాపారవేత్తలు కలిసి సృష్టించిన మోసమే ఈ పాన్ ఇండియా ట్రెండ్ అని విమర్శించారు. భారీ బడ్జెట్ చిత్రాల హడావుడి వల్ల మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
అయితే మలయాళ చిత్ర పరిశ్రమలో నటులు, దర్శకులు, నిర్మాతల మధ్య అద్భుతమైన సహకార ధోరణి ఉంటుందని, తానే గొప్ప హీరో అనే అహం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని ప్రశంసించారు. అక్కడ ఎవరూ వందల కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేయరని, ఆ మంచి వాతావరణం మిగతా పరిశ్రమలకు కూడా వ్యాపించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్స్‌లో ఒక రకమైన భయం నెలకొందని, ఏది చూపిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనన్న ఆందోళనతో దర్శకులు తమ ఆలోచనలను నిజాయతీగా, స్వేచ్ఛగా తెరపైకి తీసుకురాలేకపోతున్నారని కశ్యప్ అభిప్రాయపడ్డారు.

