epaper
Wednesday, February 18, 2026
epaper

పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి : కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి

కలం, ఖమ్మం బ్యూరో :  ఖమ్మం (Khammam) జిల్లా మున్సిపాలిటీల పరిధిలో ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న జిల్లా, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు(ఫిబ్రవరి 8న) ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపాలిటీల పరిధిలో కేటాయించిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

ఏదులాపురం మున్సిపాలిటీ (Yedulapuram Municipality) పరిధిలో ఖమ్మం రూరల్ ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ లో, మధిర మున్సిపాలిటీలో మధిర ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ లో, కల్లూరు మున్సిపాలిటీలో కల్లూరు జిహెచ్ఎస్ లో, వైరా మున్సిపాలిటీలో వైరా తహసీల్దార్ కార్యాలయంలో, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (Election Officer) తెలిపారు.

ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమకు కేటాయించిన కేంద్రాలలో తప్పనిసరిగా హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖాధికారులు ఈ సమాచారాన్ని తమ శాఖ సిబ్బందికి అత్యవసరంగా తెలియజేయాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటనలో కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి (Khammam Collector) పేర్కొన్నారు.

Read Also: మున్సిపాలిటీలకు సీఎం రేవంత్ నిధులివ్వట్లేదు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>