Mobile Popup Ad
Mobile Popup Ad

రాసోల్ గ్రామంలో చెట్టుకు కట్టి అంగన్వాడీ టీచర్‌పై దాడి

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా (Sangareddy) కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న వసంత్ కుమారి అనే మహిళను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా వేధించడం స్థానికంగా కలకలం రేపింది. ​బాధితురాలి వసంత్ కుమారి (అంగన్వాడీ టీచర్) (Teacher Assaulted) భర్త తమను మోసం చేశాడంటూ కొంతమంది గ్రామస్తులు ఆరోపించారు. భర్తపై ఉన్న కోపంతో సంబంధం లేని మహిళపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఆమెను బహిరంగంగా చెట్టుకు కట్టేసి అవమానకర రీతిలో వేధించారు. ​ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంగ్టి పోలీసులు రంగంలోకి దిగి, ఐదుగురు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>