epaper
Sunday, February 22, 2026
epaper

ఎప్​స్టీన్​ సెగ.. బర్త్​డే రోజునే కటకటాల్లోకి బ్రిటన్​ మాజీ రాజు

కలం, వెబ్ డెస్క్: ఎప్​స్టీన్ సెక్స్​ స్కాండల్​ సెగ చల్లారడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, రాజకుటుంబాల వాళ్లు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా దిగ్గజాలు, ధనవంతులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో తొలి అరెస్ట్​ నమోదైంది (Andrew Mountbatten). బ్రిటన్​ రాజు కింగ్​ చార్జెస్​ 3 సోదరుడు, మాజీ ప్రిన్స్​ ఆండ్రూ మౌంట్​బాటెన్​ విండ్సర్​ను యూకే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆయన పేరును పోలీసులు నేరుగా వెల్లడించలేదు. పదవీ దుర్వినియోగం కేసులో ఓ ప్రముఖుడిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

కాగా, ఎప్​స్టీన్​ ఫైల్స్​లో ఆండ్రూ పేరు బయటపడడం బ్రిటన్​ రాజకుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో ఆండ్రూ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. బ్రిటన్​ రాజు ప్రిన్స్​ ఛార్లెస్​కు సొంత సోదరుడైన ఆండ్రూపై గతంలోనూ ఓ మహిళ లైంగిక ఆరోపణలు సైతం చేసింది. తాను మైనర్​గా ఉండగా లైంగిక దాడి చేశారని ఆరోపించింది. దాంతో అప్పట్లో తన గౌరవ సూచకమైన టైటిల్​ ‘డ్యూక్​ ఆఫ్​ యార్క్​’ను ఆండ్రూ వదిలేసుకోవాల్సి వచ్చింది. అలాగే రాజకుటుంబానికి లభించే గౌరవాలు, అధికారాలను కూడా తొలగించినట్లు రాజకుటుంబ అధికారిక నివాసమైన బకింగ్​హామ్​ ప్యాలెస్​ ప్రకటించింది. అంతేకాదు, బలవంతంగా ఇంటి నుంచి పంపించేసింది.

ఈ క్రమంలో ఎప్​స్టీన్​ ఫైల్స్​లో ఆండ్రూ (Andrew Mountbatten) పేరు రావడం బకింగ్​హామ్ ప్యాలెస్​లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే రాజకుటుంబం పరువు బజారున పడేలా వ్యవహరించిన ఆండ్రూ.. ఎప్​స్టీన్​ సెక్స్​ స్కాండల్​తో మరింత దిగజార్చినట్లు భావించింది. కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఆండ్రూతోపాటు తామూ చులకన అవుతామని తలచింది. అందుకే తాము బాధితుల వైపే ఉంటామని ఇప్పటికే బ్రిటన్​ రాజు ఛార్లెస్​, రాణి కెమిల్లా ప్రకటించారు. ఈ క్రమంలో హఠాత్తుగా ఆండ్రూ అరెస్ట్​ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, ఆండ్రూ మౌంట్​బాటన్​ గురువారం 66వ పుట్టినరోజులోకి అడుగుపెట్టడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>