epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

ఓవర్సీస్‌లో అదరగొడుతున్న నవీన్ పోలిశెట్టి సినిమా

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించిన లేటెస్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అనగనగా ఒక రాజు“ (Anaganaga Oka Raju). యంగ్ డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. క్యూట్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.

రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 61.1 కోట్ల కలెక్షన్స్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్‌కి అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా రాజు గారు అదరగొడుతున్నారు. శనివారం ముగిసే నాటికి ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనితో ఈ సంక్రాంతి పండుగ నవీన్‌కి బాగా కలిసి వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>