కలం, సినిమా : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకుడిగా 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ ప్రపంచం మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. తనదైన స్టైల్‌లో మాస్ సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల మనసులో పూరీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పూరి జగన్నాథ్‌కు స్పెషల్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ విజయ్ సేతుపతి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ప్రియమైన పూరి సర్, ఈ చిత్రంలో మీతో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నటులుగా మమ్మల్ని నమ్మి, మా కంఫర్ట్ జోన్ దాటి ముందుకు నడిపించే దర్శకుల కోసం మేము ఎప్పుడూ ఎదురుచూస్తుంటాం. మీరు ఆ పనిని చాలా సునాయాసంగా చేస్తారు. ఈ సినిమా మనందరికీ ఒక ప్రత్యేక గుర్తుగా నిలుస్తుందని విజయ్ (Vijay Sethupathi) పేర్కొన్నారు. అలాగే దర్శకుడిగా పూరి జగన్నాథ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రభావవంతమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు.
Read Also: చిరూ, బాబీ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ?
Follow Us On: Instagram

