ఎల్మపల్లి మినీ గురుకులంలో ‘వనజీవ విద్య’ కార్యక్రమం

కలం, అచ్చంపేట: వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (HYTICOS) ఆధ్వర్యంలో, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సహకారంతో అమ్రాబాద్ (Amrabad) మండలం ఎల్మపల్లి (Elmapally) లోని TGWR EIS మినీ గురుకుల పాఠశాలలో వనజీవ విద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో 50 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి (DFO) రేవంత్ చంద్ర మాట్లాడుతూ.. పర్యావరణ వ్యవస్థలో అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యతను, వాటి సంరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు సరళమైన రీతిలో వివరించారు. విద్యార్థులు అడవుల్లోకి వెళ్లినప్పుడు లేదా జంతు ప్రదర్శన శాలలను సందర్శించినప్పుడు వన్యప్రాణులను వేధించకుండా, వాటి పట్ల గౌరవంగా ప్రవర్తించడాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమాన్ని HYTICOS organization రీసెర్చ్ అసోసియేట్ అఖిల్ గౌడ్, సోషల్ సైంటిస్ట్ ప్రేమ్ కుమార్ విద్యార్థులకు వివరించారు. అడవుల్లోకి వెళ్లి వన్యప్రాణులను ఇబ్బంది పెట్టకుండా ఉండటం, వాటికి సురక్షితమైన దూరం పాటించడంతో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మంచిదని తెలిపారు. అదే విధంగా ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా బాధ్యతాయుతమైన ప్రవర్తన గురించి విద్యార్థులకు వివరించారు.

చిన్న వయసు నుంచే ప్రకృతి, వన్యప్రాణుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచవచ్చని కార్యక్రమంలో తెలియజేశారు. వనజీవ విద్య కార్యక్రమం ద్వారా చిన్నారులను ప్రకృతికి చేరువ చేయడం, అడవులు, వన్యప్రాణుల పట్ల అవగాహన, ప్రేమ, బాధ్యతను పెంపొందించడం HYTICOS లక్ష్యం అని కోఆర్డినేటర్ బాపురెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>