కలం, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్ వరదల ప్రభావం అమర్‌నాథ్ యాత్రికులపై పడింది. భారీ వర్షాలు, వరదలతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)ను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పహల్గామ్, బాల్తాల్ రెండు మార్గాల నుండి యాత్రను నిలిపివేస్తున్నామని కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ వెల్లడించారు. బాల్తాల్, నున్వాన్ చందన్‌వారి బేస్ క్యాంపుల నుండి భక్తులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రోడ్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే యాత్ర పునరుద్ధరణపై తదుపరి ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ ఏడాది 3.7 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ గుహను దర్శించుకున్నారు.
Read Also: అడవి లోగిలిలో ప్రకృతి కోలాహలం!
Follow Us On: Instagram

