కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తాజాగా ‘గుర్తుకొస్తున్నాయి’ (Gurthukosthunnayi) వెబ్ సిరీస్పై ప్రశంసలు కురిపించారు. ఈ సిరీస్ గురించి అద్భుతమైన స్పందనలు వింటున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నా ప్రియమైన శరత్ చంద్రకు, అలాగే మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. నిర్మాతగా మీ తొలి అడుగు వేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ అందమైన సిరీస్కు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు, ఘన విజయం లభించాలని కోరుకుంటున్నాను. మొత్తం నటీనటులు, సాంకేతిక బృందానికి నా శుభాకాంక్షలు. ఈ సిరీస్ను ETV Winలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని అల్లు అర్జున్ (Allu Arjun) తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వినోద్ గాలి, నిర్మాత శరత్ చంద్రతో పాటు నటీనటులు విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, సుహాస్, రక్షిత మణివన్నన్ తదితరులకు బన్నీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
Read Also: పిల్లల్లో పోషకాల లోపానికి ‘ఎన్ఐఎన్’ ఈజీ సొల్యూషన్!
Follow Us On : WhatsApp

