Mobile Popup Ad
Mobile Popup Ad

ట్విస్ట్.. కోర్ట్ విచారణకు హాజరైన అల్లు అర్జున్

కలం, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) జడ్జి ముందు హాజరయ్యారు. ముంబైలో రాకా సినిమా షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ జడ్జి అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్లు అతడి లాయర్లు తెలిపారు. ముందస్తుగా ఫిక్సయిన షెడ్యూల్స్ కారణంగానే వ్యక్తిగతంగా రాలేకపోతున్నట్లు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతిస్తే వెంటనే జాయిన్ అవుతానని విచారణ సందర్భంగా లాయర్లు న్యాయమూర్తికి వివరించారు. అంగీకరించడంతో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. అనంతరం కేసు విచారణ జులై 6వ తేదీకి వాయిదా వేయగా.. అప్పుడు సైతం తాను వీడియో కాన్ఫరెన్స్‌లోనే హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ కోరారు. జడ్జి అందుకు అంగీకరిస్తూ.. విచారణ ముగించారు.

అంతకుముందు హైడ్రామా..

ఉదయం నుంచి నాంపల్లి కోర్ట్ వద్ద హైడ్రామా నెలకొంది. అల్లు అర్జున్ వస్తారా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది. కేసు వాయిదా తరువాత కూడా నిందితుల్లో అల్లు అర్జున్ ఒక్కరే హాజరు కాలేదని పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయినట్లు లాయర్లు పేర్కొనడం గమనార్హం. కాగా, ఈ కేసులో ఇప్పటికీ అల్లు అర్జున్ బెయిల్ మీదనే ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>