కలం, సినిమా : ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha Arts) సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ “దీవానా”(Deewana). టాలీవుడ్ యంగ్ స్టార్స్ హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేగలై ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించారు. శ్రీకాంత్ సంగిశెట్టి డైరెక్ట్ చేసిన ‘దీవానా’ మూవీ జూన్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్రజెంట్ యూత్ లవ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఈరోజుల్లో లవ్ అంటే కార్నర్ సీట్స్ బుక్ చేసుకుని సినిమా చూడడం, షాపింగ్‌కు వెళ్లడం, చివరకు ఓయో రూమ్‌లో ఎండ్ అవుతోంది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రస్తుత జనరేషన్ ప్రేమ తీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటి యువత ప్రేమను లోతుగా అర్థం చేసుకోకుండా కేవలం వినోదం, టైంపాస్‌గా తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ప్రేమ అంటే పరస్పర గౌరవం, నమ్మకం, బాధ్యతలతో కూడిన బంధం కావాలని, కానీ ఇప్పుడు ఆ విలువలు తగ్గిపోతున్నాయని తెలిపారు.

