అసెంబ్లీలో ఏలేటి గళం.. ప్రభుత్వ పాఠశాలలకు నిధుల వరం

కలం, నిర్మల్‌ : నిర్మల్‌ నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో(Nirmal Govt Schools) బాలురు, బాలికల కోసం 64 టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.069 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (Alleti Maheshwar Reddy) గళమెత్తారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకతను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించిన నేపథ్యంలో నిర్మల్‌ నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలల్లో పారిశుద్ధ్య వసతులు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా బాలురు, బాలికలకు అవసరమైన టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>