అరెస్టుల‌పై వ‌రంగ‌ల్‌లో సీజేపీ నేత‌ల నిర‌స‌న‌

కలం, వరంగల్‌: కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) నేతలను ఢిల్లీకి వెళ్లకుండా మధ్యలోనే అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వరంగల్‌ (Warangal) రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు మీడియా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఢిల్లీకి వెళ్తుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని వారు ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు లేదా? అని నిలదీశారు.

బీజేపీకి తాము వ్యతిరేకులమని, అయితే ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నిస్తే అణచివేతకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. అరెస్టులు, నిర్బంధాలు, అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో మార్పు కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఒక వ్యక్తిని కాపాడేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుపై సీజేపీ మ‌ద్ద‌తుదారులు ప్రశ్నలు లేవనెత్తారు. ఉగ్రవాదులను తరలించిన తరహాలో తమను తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి నుంచి నిద్ర లేకుండా గడిపామని తెలిపారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ పదవికి రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>