నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే?

కలం, సినిమా : నేచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ‘అలియాస్ రుక్మిణి’ ( Alias Rukmini) రిలీజ్ డేట్ ఖరారైంది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర బృందం విడుదల తేదీకి సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్‌ను పరిశీలిస్తే.. చెక్ షర్ట్ , కళ్ళజోడు, భుజానికి క్రాస్ బ్యాగ్‌తో ఒక సాధారణ మధ్యతరగతి విద్యావంతుడి లుక్ లో నితిన్ కనిపిస్తున్నారు. నితిన్ జనసందోహంలో నడుస్తున్న వేళ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మహిళ షాడో డిజైన్ చేసిన తీరు సినిమా కాన్సెప్ట్‌పై తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో అసలు రుక్మిణి’ పాత్రలో నటించే హీరోయిన్ ఎవరనేది ఉత్కంఠగా మారగా, అక్టోబర్ 13న హీరోయిన్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, జోమోన్ టి. జాన్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>