కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని పశ్చిమ అలాస్కాలో ఓ చార్టర్ విమానం (Alaska Charter Plane Crash) కుప్పకూలింది. మారుమూల ప్రాంతంలోని రాడార్ కేంద్రం సమీపంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం యాంకరేజ్ నుంచి బయలుదేరి కేప్ న్యూన్‌హామ్‌ను సమీపిస్తుండగా క్రాష్ జరిగినట్లు తెలుస్తోంది.
కేప్ న్యూన్‌హామ్ లాంగ్ రేంజ్ రాడార్ కేంద్రం సమీపంలో విమాన ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో అలాస్కా రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కెన్యాలో కూలిన హెలికాప్టర్
ఉత్తర కెన్యాలో జరిగిన మరో విమాన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ కుప్పకూలింది.

