కలం, నల్లగొండ బ్యూరో: నల్గొండ (Nalgonda) లోని గొల్లగూడ పీఏసీఎస్ చైర్మన్ (PACS Chairman) గా ఆలకుంట నాగరత్నం రాజు (Alakunta Nagaratnam Raju) ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగరత్నంరాజు మాట్లాడుతూ .. గొల్లగూడ పీఏసీఎస్ నుండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తూ రైతులకు సకాలంలో ఋణాలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.
రైతులకు సేవ చేయడం ఎంతో అదృష్టం అని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తూ సొసైటీని మొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది, అభిమానులు చైర్మన్‌ను పూల మాలలు, బోకే, శాలువాతో అభినందిస్తూ సన్మానించారు. కాగా, పీఎసీఎస్ చైర్మన్ల పదవి కాలం గతంలోనే ముగియగా వారి పదవికాలాన్ని మరోసారి పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: మోదీ
Follow Us On: X(Twitter)

