కలం, వెబ్ డెస్క్ : అనంతపురం (Anantapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు యువకులు సజీవదహనమైన విషాద ఘటన కలకలం రేపింది. అరవకూరు చెరువు (Aravakur Lake) క్రాస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో వాహనం అదుపుతప్పి ఒక బైక్, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ను గట్టిగా ఢీకొనడంతో పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
మృతులను వజ్రకరూరు మండలానికి చెందిన అజిత్ కుమార్, ఆకాష్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి (Aravakur Lake) చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Read Also: ముంబై కథ ముగిసినట్లే: మురళీ కార్తీక్
Follow Us On: WhatsApp

