అక్కడ పోటీకి సిద్ధం.. అక్బరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి తన కుటుంబాన్ని లాగొద్దని ఆయన సూచించారు. జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను నిజాయితీతోనే ఎన్నికల్లో విజయం సాధించానని పేర్కొన్నారు. తన కుమార్తె వివాహానికి ముందే అనాథ పిల్లల బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్లు జమ చేసినట్లు అక్బరుద్దీన్ వెల్లడించారు. రాజకీయాల విషయంలో తన కుటుంబాన్ని ప్రస్తావించవద్దని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి.

మాట మార్చేశాడు..

తనకు వయసు పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతం పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని అక్బరుద్దీన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి సైతం తాను లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ విషయమై అక్బరుద్దీన్ కేవలం నాలుగు రోజుల వ్యవవధిలోనే మాట మార్చడంపై రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

Also Read : వంట చేసిన కేటీఆర్.. ఎవ‌రి కోస‌మంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>