నందిగుండంలో వైభవంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల (Sharannavaratri Celebrations) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 11వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఆలయంలో భవాని మాలధారణ కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 20న విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>