కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బెంగళూరులో ఈ నెల 22 నుంచి 26 వరకు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) అఖిల భారత జాతీయ 43 మహాసభల కార్మిక సమ్మేళనం జరగబోతుంది. దీనికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఏఐటీయూసీ నేత పి.సురేష్ ఎంపికయ్యారు. ఈ జాతీయ కార్మిక సమ్మేళనంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్స్ పర్యవసనాలు, ప్రభుత్వ రంగ పరిరక్షణ, చట్టబద్ధ హక్కులు, కనీస వేతనాలు, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు-వాటి పర్యవసనాలు, రాజ్యాంగ పరిరక్షణ లాంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి. 29 రాష్ట్రాలతో పాటు, కేంద్ర ప్రాంత ప్రాంతాల కార్మిక వర్గ పోరాటాల ఉద్యమ నేతలు పాల్గొంటారని సురేష్ తెలిపారు.

