ఐ వాంట్ నయనతార.. ఏఐఏడీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu)లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి ఓటర్లను ఆకర్శించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమిళనాట రచ్చ చేస్తున్నారు. తమిళనాడు మాజీ మంత్రి, ప్రస్తుతం ఏఐఏడీఎంకే ఎంపీగా సి.వి. షణ్ముగం (AIADMK MP Shanmugam) సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన నటి నయనతార (Nayanthara) గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన పథకాలను ఎద్దేవా చేసే క్రమంలో నయనతార పేరును ప్రస్తావించారు.

‘అబ్దుల్ కలాం (Abdul Kalam) మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార (Nayanthara) కావాలని కల వస్తే.. నా కోరికని స్టాలిన్ తీరుస్తారా?‘ అంటూ షణ్ముగం వివాదస్పదమైన కామెంట్స్ చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు కేవలం నటి నయనతారనే కాకుండా, మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.

ఈ వివాదంపై అధికార పార్టీ డీఎంకే (DMK)తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రసంగించిన షణ్ముగం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సెంట్రల్ ఫండ్స్ రిలీజ్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>