వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఏఈవో ఆత్మహత్య

కలం, చిట్యాల : వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖ ఏఈవో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల (Chityala) మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) వ్యవసాయ శాఖలో ఏఈవోగా పనిచేస్తూ ప్రస్తుతం కేతపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నాడు.

అప్పు ఇచ్చిన వ్యక్తులు అధిక వడ్డీ లెక్కలు చూపుతూ, మోసపూరితంగా చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బుల విషయమై బాలరాజుపై వడ్డీ వ్యాపారులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో చిట్‌ఫండ్ ఏజెంట్ల వేధింపులు భరించలేక బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ కే.నాగరాజు, ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>