న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ఎంతో ఉపయోగకరం: అడ్వకేట్ వెంకట్రామ్

కలం, మునుగోడు: నూతన న్యాయవాదులకు న్యాయవృత్తిలో రాణించేందుకు ‘క్రాస్ కోడ్: ది మోడరన్ ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్’ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హైకోర్టు న్యాయవాది ఆకుల వెంకట్రామ్ పటేల్ (Advocate Venkatram) అన్నారు. ఆదివారం చండూర్ మండల కేంద్రంలో రచయిత, హైకోర్టు అడ్వకేట్ బొమ్మరగోని కిరణ్ రచించిన ఈ పుస్తకాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆకుల వెంకట్రామ్ పటేల్ మాట్లాడుతూ, క్రాస్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన అంశాలను తెలుసుకోవడంలో ఈ పుస్తకం నూతన న్యాయవాదులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. న్యాయవృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి పుస్తకాలు విలువైన మార్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

చిన్న వయసులోనే రచయిత బొమ్మరగోని కిరణ్ న్యాయరంగానికి ఉపయోగపడే పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్‌గా గుర్తింపు పొందడంతో పాటు, పత్రికల్లో నిరంతరం వ్యాసాలు రాస్తూ, పుస్తక రచనలోనూ ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని మంచి పుస్తకాలను రచించి తన ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు కంచర్ల నిశాంత్, గద్వాల్ గోవింద్, సీనియర్ పాత్రికేయులు కంచర్ల అంజయ్య, జెర్రిపోతుల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>