సీఈసీ రాజీనామా కోసం ఆందోళ‌న కొన‌సాగిస్తాం: ఖర్గే

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గతంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పలువురు ఎగతాళి చేశారని గుర్తు చేశారు.

ప్రస్తుతం స్వ‌యంగా కేంద్ర ఎన్నికల సంఘంలోని ఇద్దరు సభ్యులు వ్యవస్థలోని లోపాలు, నిర్వహణలోని సమస్యలను బయటపెట్టారని వెల్ల‌డించారు. ఓట్లను తారుమారు చేయడం, దొంగిలించడం వంటి ఆరోపణలపై సమాచారం ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోలేదని ఖర్గే విమర్శించారు. ఈ విషయాలపై ఎన్నికల సంఘంలోని సభ్యులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లిఖితపూర్వకంగా తెలియజేసినా స్పందన లేదని ఆరోపించారు.

మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలోని అలంద్‌, మహదేవపుర వంటి ప్రాంతాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ మొదటి నుంచీ ప్రశ్నిస్తున్నారని ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఓట్ల అక్రమాలపై రాహుల్ గాంధీ ఆధారాలతో వివరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఆందోళనలు ప్రారంభించామని, రాహుల్ గాంధీ వాదనలను అర్థం చేసుకున్న పలువురు యువత ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి పార్టీలన్నీ ఏకమై ఈ ఆందోళనను కొనసాగిస్తున్నాయని ఖర్గే పేర్కొన్నారు.

Also Read : 2047 నాటికి భారత్ అభివృద్ధి: ప్రధాని మోదీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>