సంక్షేమ విద్యార్థులకు సకల సౌకర్యాలు: మంత్రి లక్ష్మణ్

కలం, జగిత్యాల: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (Kammaripalli KGBV)లో రూ. 67 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేసిన మంత్రి, విద్యార్థులకు షూస్స్ తోపాటు బ్యాగులను అందజేశారు.  ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మండలంలోని తహసిల్దార్, ఎంపీడీవోలు వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలను, సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని ఆదేశించారు.

విద్యార్థులు చదువులో రాణించాలి..

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చదువులో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాతో పాటు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని  అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.

నెలకు ఒకసారి సందర్శిస్తా..

కుమ్మర్ పల్లి కస్తూర్బా వసతి గృహాన్ని ప్రతి నెలకు ఒకసారి సందర్శిస్తానని మంత్రి తెలిపారు. విద్యార్థులకు అవసరమైన క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటానని అన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చదువులో రాణిస్తూ మంచి మార్కులు సాధించినందుకు పాఠశాల ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల ఆమని, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, వెల్గటూర్ తహాసీల్దార్ తో పాటు పలువురు అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>