KGBV సివిల్ పనులు.. అధికారులకు అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) చేపడుతున్న సివిల్ పనుల (Civil Works) పురోగతిపై స్థానిక సంస్థల మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో KGBVల్లో కొనసాగుతున్న పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించారు.

పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో EWIDC డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆ తీర్పు చాలా బాధాకరం: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>