కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ జోసెఫ్ సృష్టించిన సంచలనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 234 స్థానాల్లో ఏకంగా 106 నియోజకవర్గాల్లో విజయం సాధించి రాజకీయ దిగ్గజాలకు విజయ్ షాక్ ఇచ్చారు. ఈ అద్భుత విజయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవినీతి రాజకీయ పార్టీల నాయకులకు ఇదొక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. క్రైస్తవ, తెలుగు, తమిళ యువత విజయ్ వైపు నిలబడటమే ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణమని వివరించారు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న విజయ్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడుతూ యువత ఏకమవ్వడం వల్లే ఈ అసాధ్యమైన ఫలితం సాధ్యమైందని పాల్ పేర్కొన్నారు.

