25వేల లీటర్ల యాసిడ్ రోడ్డుపైకి.. తమిళనాడులో కలకలం!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) లో భారీ రసాయన ప్రమాదం చోటుచేసుకుంది. దిండిగల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున హైడ్రోక్లోరిక్ యాసిడ్ తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 25 వేల లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ రోడ్డుపైకి లీకైంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి నుంచి కరూర్ కు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తరలిస్తున్న ట్యాంకర్ లారీ దిండిగల్ జిల్లా కలెక్టరేట్ సమీపానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపు తప్పి రోడ్డుకు అవతలి వైపునుకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో వెనుక నుంచి మరరో వాహనం ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ వెనుక భాగంలో డ్రెయిన్ వాల్వ్ దెబ్బతిని భారీగా యాసిడ్ బయటకు లీకైంది.

ప్రమాదం కారణంగా సుమారు 25వేల లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ రోడ్డుపైకి చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకైన యాసిడ్ తీవ్రతను తగ్గించేందుకు పెద్ద మొత్తంలో నీటిని చల్లుతూ సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

మరోవైపు, ప్రమాదానికి గురైన ట్యాంకర్ ను అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఘటనా స్థలంలోనే భద్రపరిచారు. యాసిడ్ లీకేజీ వల్ల మరింత ప్రమాదం తలెత్తకుండా సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ఘటనపై దాడికొంబు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>