ఏసీబీ అదుపులో సివిల్‌ సప్లైస్‌ అధికారి

కలం, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో శుక్ర‌వారం తెలంగాణ‌ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు (ACB Raids) నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సివిల్‌ సప్లైస్‌ అధికారి వాసంశెట్టి నరసింహారావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్‌ నేతృత్వంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. నరసింహారావు కార్యాలయంతో పాటు ఆయన నివాసం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం.

ఖమ్మంలో నివాసం ఉంటున్న నరసింహారావును అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో గుర్తించిన ఆస్తుల వివరాలు, వాటి విలువ, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Also Read : వంట చేసిన కేటీఆర్.. ఎవ‌రి కోస‌మంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>