2.5 ఎకరాల్లో స్లమ్ ఏరియా సెట్.. నాని మూవీ కోసం భారీగా ఖర్చు

కలం, వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని (Nani) కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ ది ప్యారడైజ్ (The Paradise). శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 2026 ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా మూవీకి సంబంధించిన సెట్ ఫొటోలు రిలీజ్ చేశారు. మొన్న వచ్చిన ఆయా షేర్ సాంగ్ లో నాని ఉండే స్లమ్ ఏరియాను చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సెట్ వివరాలను తాజాగా మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

ఈ ప్యారడైజ్ (The Paradise) కోసం 2.5 ఎకరాల్లో స్లమ్ ఏరియాను సెట్ గా వేశారు. అలాగే హీరో నాని ఉండే ఇంటిని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో నిర్మించారు. సెట్ లో రెడీమేడ్ జలాశయాన్ని కూడా సృష్టించేందుకు ఏకంగా 100 ట్యాంకర్ల నీటిని వినయోగించారు. డమ్మీ ఇండ్లు కాకుండా 60 పక్కా ఇండ్లతో విలేజ్ సెట్ రూపొందించారు. 500 మంది ఒకేసారి ఉండేలా ఈ ఇండ్లను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు నాని నటించిన ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో సెట్ వేయలేదు. గతంలో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లోనే వచ్చిన దసరా మూవీ కోసం ఇలాంటి సెట్లు వేశారు. కానీ అవి ఈ రేంజ్ బడ్జెట్ లో వేయలేదని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

Read Also: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అనుష్క.. వరుడు ఎవరంటే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>