‘సర్‌’పై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు: దినేష్ పటేల్

కలం, నిజామాబాద్ బ్యూరో: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చేస్తున్న నిరాధార ఆరోపణలను బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి (Dinesh Patel Kulachari) ఖండించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సర్ జరిగిన రాష్ట్రాల్లో ఓటర్లకు సుమారు 4 నుంచి 5 నెలల సమయం ఇచ్చారని గుర్తు చేశారు.

దేశంలోని మొత్తం 95 కోట్ల మంది ఓటర్లలో 82 కోట్ల మంది (88%) స్వచ్ఛందంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేశారని దినేష్ పటేల్ కులచారి తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు ఓట్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటే, 82 కోట్ల మందిని కాంగ్రెస్ అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కొనియాడుతుంటే, రాహుల్ గాంధీ చేస్తున్న నిరసనలను చూసి సొంత పార్టీ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారనీ విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>