నిర్మల్‌లో ఘనంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ పీఠికను నాయకులు, కార్యకర్తలు సామూహికంగా పఠించారు.

రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి అబ్దుల్ సాధిక్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి మెరుగు రాజన్న, అధికార ప్రతినిధి వసంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>