మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మేయర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రం క్రీడా మైదానంలో మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన క్రికెట్ మ్యాచ్‌లను నగర మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ టాస్ వేసి ఘనంగా ప్రారంభించారు. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జర్నలిస్ట్ మిత్రులకు, ప్రెస్ క్లబ్ బాధ్యులకు మేయిర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

మేయర్ ​కేవలం టోర్నమెంట్‌ను ప్రారంభించడమే కాకుండా, మైదానంలోకి దిగి స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడటం అక్కడున్న వారందరిలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. జర్నలిస్టులు అందరూ క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. నిరంతరం వార్తలతో బిజీగా ఉండే జర్నలిస్టులకు ఇలాంటి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయని ఈ సందర్భంగా మేయర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 6వ వార్డు కార్పొరేటర్ రామస్వామి , 1వ వార్డు కార్పొరేటర్ రామాంజనేయులు ,​14వ వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ శ్రీఫ్ , నరేంద్ర చారి (ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు),​ నరేందర్ గౌడ్ (ప్రెస్ క్లబ్ సెక్రటరీ),​ మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ (ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు),​ చింతకాయల వెంకటేష్,​ బండి విజయ్ కుమార్,​ కాటం నాగరాజు గౌడ్ లతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మ్యాచ్‌లను విజయవంతం చేశారు.

Read Also: ఇకపై బైక్ హ్యాండిల్ వదిలేస్తే దబిడి దిబిడే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>