కలం వెబ్ డెస్క్ : కోలీవుడ్(Kollywood) స్టార్ విజయ్(Vijay Thalapathy) నటిస్తున్న లేటెస్ట్ అండ్ లాస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan). ఈ మూవీని హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి జనవరి 9న జన నాయగన్ భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల్లోకి రాబోతున్నారు. దీంతో విజయ్ నటించిన ఈ ఆఖరి సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ మూవీ రిలీజ్ కాకుండానే సరికొత్త రికార్డ్ సెట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. విజయ్ సెట్ చేసిన నయా రికార్డ్ ఏంటి?
జన నాయగన్(Jana Nayagan).. మూవీ బాలయ్య నటించిన భగవంత్ కేసరి ఆధారంగా తెరకెక్కుతుండడం విశేషం. ఇప్పటి వరకు రిలీజైన ఈ సినిమా పాటలు అంచనాలు మరింతగా పెంచేశాయి. ఈ చిత్రానికి సంబంధించి యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం 24 గంటల్లోనే 12.7 వేలకు పైగా జన నాయగన్ టికెట్లు సేల్ అయ్యాయట. ఇది తమిళ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. విశేషమేమిటంటే ఈ రికార్డు గతంలో విజయ్ నటించిన లియో పేరిట ఉండేది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో మూవీ 24 గంటల్లో 10 వేల టికెట్లు సేల్ అయ్యాయి. ఇప్పుడు జన నాయగన్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.
దీన్ని బట్టి జన నాయగన్ కు ఎంత క్రేజ్ ఉందో ఎంతలా ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్ధమౌతుంది. ఇందులో విజయ్ కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తుంటే.. మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు(Mamitha Baiju) కీలక పాత్ర పోషిస్తుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. మరి జన నాయగన్ రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
Read Also: ఎల్లమ్మ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
Follow Us On: Pinterest


